123

Sunday 21 June 2015

సిద్ధమంగళ స్తోత్రము SIDHAMANGALA STOTRAM

                   సిద్ధమంగళ స్తోత్రము



శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా I
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజఋషి గోత్రసంభవాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోదిత శ్రీచరణాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపాI
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవII

                  ----------------- XXX -----------------

No comments:

Post a Comment